బడి పిల్లలు భద్రమేనా! జిల్లాలో ఫిట్నెస్ బస్సులు ఎన్ని

బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం

Aug 25, 2025 - 15:08
 0  1
బడి పిల్లలు భద్రమేనా! జిల్లాలో ఫిట్నెస్ బస్సులు ఎన్ని

రాజభారత్ న్యూస, బాపట్ల, ఆంధ్రప్రదేశ్ (25 ఆగష్టు 2025) : ఘోర రోడ్డు ప్రమాదం స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు... బాపట్ల పట్టణంలోని సోమవారం ఉదయం నారాయణ స్కూల్ బస్సు వేగంగా దూసుకు వచ్చి బైక్ పై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.. నారాయణ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ఒక ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఘటన జరిగిన వెంటనే స్కూల్ బస్సు డ్రైవర్ కనీసం వ్యక్తి ఎలా ఉన్నాడో అని చూడకుండా బస్సు అక్కడ వదిలేసి పారిపోయాడు... బాపట్ల పట్టణంలో నారాయణ స్కూల్ బస్సు లు వల్ల ట్రాఫిక్ అంతరాయం ప్రతిరోజు జరుగుతూనే ఉంది.. డ్రైవర్లు నిర్లక్ష్యంగానే ప్రజలతో గొడవ పడుతూ ప్రతిరోజు ఇదే తంతు.. ఏమైనా అంటే మాది నారాయణ స్కూల్ అని అహంకారంగా జవాబు ఇచ్చే వారు... జిల్లాలో స్కూల్ ఫిట్నెస్ బస్సులు ఎన్ని ఉన్నాయి ఫిట్నెస్ లేని బస్సులు ఎన్ని ఉన్నాయని ఇంకా లెక్క తేలాల్సి ఉంది... ఘటన స్థలానికి వెంటనే చేరుకుని బాపట్ల పట్టణ సీఐ పీ రాంబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. స్కూల్ బస్సును స్టేషన్ కు  తరలించి కేసు నమోదు చేశారు.. నిర్లక్ష్యంగా పాఠశాల యాజమాన్యం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం నిర్లక్ష్యానికి అర్థం పడుతూ ఈ హృదయ విదాకార సంఘటన నిలిచింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0