ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. మాల్దీవులకు రూ.4850 కోట్ల రుణం

Jul 26, 2025 - 09:00
Aug 13, 2025 - 11:48
 0  2
ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. మాల్దీవులకు రూ.4850 కోట్ల రుణం

రాజభారత్ న్యూస్, హైదరాబాద్‌, జూలై 26 :  భారత్-మాల్దీవుల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. మాలేలో శుక్రవారం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో భేటీ అయిన ప్రధాని మోదీ, మిత్రదేశంగా మాల్దీవ్స్‌కు ₹4,850 కోట్ల రుణం అందిస్తున్నట్టు ప్రకటించారు. మాల్దీవుల వార్షిక రుణ చెల్లింపుల మొత్తాన్ని 40 శాతం మేర కుదించారు. ఈ ప్రకటన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న మాల్దీవులకు ఊరట కల్పించనుంది. వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాలపై విస్తృత చర్చ జరిగింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0