చెక్కెర , నూనె వినియోగం తగ్గించడం ద్వారా స్థూలకాయం నివారణ
ఐసిడిఎస్ సూపర్వైజర్ విశ్రాంతమ్మ

రాజభారత్ న్యూస్, చల్లపల్లి , (18 సెప్టెంబరు 2025) : చెక్కెర నూనె వినియోగం తగ్గించడం ద్వారా స్థూలకాయం నివారించవచ్చని మొవ్వ ఐసిడిఎస్ సూపర్వైజర్ కె ఇశ్రాంతమ్మ తెలిపారు 8వ జాతీయ పోషక మహోత్సవాల్లో భాగంగా మొవ్వ ఐసిడిఎస్ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో సుపోషిత్ భారత్ సా క్షం భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం లక్ష్మీపురం ఐసిడిఎస్ సెక్టార్ పరిధిలోని మేక వారి పాలెం పాగోలు అంగన్వాడీ కేంద్రాలలో స్థూలకాయం నివారణ అను అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూపర్వైజర్ విశ్రాంతమ్మ పాల్గొని స్థూలకాయం నివారణపై అవగాహన కల్పించారు స్థూలకాయం నివారణకు వంటకాలలో నూనె వాడకం తగ్గించడంతోపాటు పంచదార వాడకం తగ్గించాలని సూచించారు అలాగే ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటించాలని వాటిని పాటించడం ద్వారా అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు అంగన్వాడి కేంద్రాలలో కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం పరుచుకుని ఎప్పటికప్పుడు పిల్లల ఎత్తు బరువు పరిశీలించు కోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మహాలక్ష్మి రజిత లతోపాటు పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?






