ఒక రోజులో ఎన్నిసార్లు చలాన్ రాస్తారు?

ట్రాఫిక్ రూల్స్ తెలిస్తే షాక్ అవుతారు!

Sep 18, 2025 - 19:30
 0  1
ఒక రోజులో ఎన్నిసార్లు చలాన్ రాస్తారు?

రాజభారత్ న్యూస్,  (18 సెప్టెంబరు 2025)ట్రాఫిక్ రూల్స్ గురించి మనదేశంలో చాలామందికి అవగాహన ఉండదు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ రూట్, రెడ్ లైట్ క్రాసింగ్, ఓవర్ స్పీడ్.. ఇలా ఒక్కో రూల్ ఒక్కోలా ఉంటుంది. రోజులో ఒకసారి చలాన్ కడితే ఇక ఆ రోజు ఎన్నిసార్లు రూల్స్ క్రాస్ చేసినా, మళ్లీ ఫైన్ కట్టే అవసరం లేదని అనుకుంటారు చాలామంది. అయితే ఈ రూల్.. ఉల్లంఘన రకాన్ని బట్టి ఉంటుంది. కొన్నింటికి రోజుకు ఒకసారి మాత్రమే చలాన్ వేస్తారు, మరికొన్నింటికి రోజులో ఎన్ని సార్లు దొరికితే అన్ని సార్లు చలాన్ వేస్తారు. వీటి గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

ఓవర్ స్పీడ్

స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ వేగంగా బండి నడిపితే.. దాన్ని ఓవర్ స్పీడ్ గా పరిగణిస్తారు. ఇది రోజుకి ఒకసారే అని ఉండదు. రోజులో ఎన్నిసార్లు స్పీడ్ లిమిట్ దాటితే అన్ని సార్లు ఫైన్ పడుతుంది. ఉదాహరణకు, మీరు అతివేగంగా బండి నడిపి ఫైట్ కట్టి.. కొంత దూరం వెళ్లాక మళ్లీ ఓవర్ స్పీడ్ లో వెళ్తూ.. పట్టుబడితే.. మళ్లీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

సిగ్నల్ క్రాస్

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెట్ లైట్ పడ్డప్పుడు ఆగకుండా వెళ్లిపోతుంటారు చాలామంది. ఇలాంటి సందర్భాల్లో కూడా పదే పదే చలాన్ పడుతుంది. రోజులో ఎన్ని సిగ్నల్స్ క్రాస్ చేస్తే.. అన్ని సార్లు ఫైన్ పడుతుంది.

రాంగ్ రూట్

కొంతమంది రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తూ.. పోలీసులకు దొరుకుతారు. అప్పుడు పోలీసులు వేసిన చలాన్ కట్టాల్సి ఉంటుంది. తర్వాత మళ్లీ రాంగ్ రూట్ లో వెళ్తూ మరొకచోట పోలీసులకు పట్టుబడితే.. ఇందాకే కట్టాను అంటే కుదరదు. మళ్లీ ఫైన్ కట్టాల్సిందే.

హెల్మెట్

ఇకపోతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినప్పుడు రోజులో ఒకసారే ఫైన్ వేస్తారు. ఒకసారి చలాన్ కట్టాక ఇక ఆరోజులో మరొకసారి పట్టుబడినా.. చలాన్ కట్టాల్సిన పని లేదు.

డ్రంక్ అండ్ డ్రైవ్

ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి తెలిసిందేగా? ఇది ఒక రోజుకి సంబంధించింది కాదు. ఒకసారి తాగి డ్రైవ్ చేస్తూ దొరికితే బండి సీజ్ చేస్తారు. కోర్టుకి వెళ్లి ఫైన్ కట్టాక బండి విడుదల చేస్తారు. కాబట్టి ఇది అన్నింటికంటే ప్రమాదం అని గుర్తుంచుకోవాలి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0