వర్ష0 పడుతున్నా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమ ప్రచారంలో ఇంటింటికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

రాజభారత్ న్యూస్, హైదరాబాద్, జూలై 26 : పెనుగంచిప్రోలు మండలం, లింగగూడెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వర్ష0లో తడుస్తూ ఇంటింటికీ తిరుగుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలని కరపత్రాల రూపంలో ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ…
ప్రతి కుటుంబానికి NDA కూటమి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. ఇది మంచి పాలనకు నిదర్శనం.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు చింతల సీతారామయ్య, నాయకులు మురుకుట్ల వెంకటేశ్వరరావు (బొజ్జయ్య), మురుకుట్ల వెంకటేశ్వరరావు(బక్కయ్య), మాదినేని వెంకట్రావు ,ఏనుగుల వెంకటరెడ్డి(బాబు), క్లస్టర్ చుంచు రమేష్ మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?






