జగ్గయ్యపేట తహసీల్దార్ వేధింపులతో మహిళా విఆర్ఓ ఆత్మహత్నం

జిల్లా కలెక్టర్ మేలుకోకపోతే మరిన్ని ప్రమాదాలు

Aug 25, 2025 - 15:31
 0  1
జగ్గయ్యపేట తహసీల్దార్  వేధింపులతో మహిళా విఆర్ఓ ఆత్మహత్నం

రాజభారత్ న్యూస,  ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట , ఆంధ్రప్రదేశ్ (25 ఆగష్టు 2025) :    జగ్గయ్యపేట మండలంలో రోజురోజుకి మారుతున్న అధికారులు తీరు.   ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మరో వైపు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ,  న్యాయం జరిగే పరిస్థితిలో లేదు అంతా అడ్డదారి వైపు వెళ్తున్న అధికారుల తీరు అంటూ సామాన్య ప్రజల ఆందోళన. 

 సామాన్యుని పట్టించుకునే నాధుడే లేడు,  ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్న తీరు

1 మొదటిదిగా పోలీస్ స్టేషన్
2 రెవిన్యూ ఆఫీస్ 
3 మున్సిపాలిటీ ఆఫీస్ ఈ మూడు చోట్లకి వెళ్లాలంటే 

రాజకీయ నాయకులతో రికమండేషన్ అయినా అయి ఉండాలి లేకపోతే చేతులు డబ్బులు అయినా ఉండాలి ఈ రెండు లేకపోతే అక్కడికి వెళ్లిన వ్యర్థం అంటూ ప్రజలు ఆందోళన.

 ఇది జగ్గయ్యపేటలో జరుగుతున్న పరిస్థితి 

 ఎక్కడికి వెళ్ళినా పైసా వసూల్ 

 జగ్గయ్యపేట మండలంలో  డిప్యూటీ తాసిల్దార్ గా ఉన్న మనోహర్ కు ఎస్ ఎస్సీ అవకాశం కల్పించడంతొ గత ఆరు ఏడు నెలలుగా ప్రతి పనికి ఒక రేటు గా వ్యవహరిస్తున్నారని ప్రజల నుండి ఆరోపణలు. 

 ఈ తరహాలో ప్రభుత్వ కార్యాలలో ఇలా రేట్లు ఫిక్స్ చేయవచ్చా? చేయకూడదా??

 నిబంధనలు తుంగలోకి తొక్కి ఇస్తానుసారంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు . 

 చుట్టుపక్కల అనేక గ్రామాలలో అసెస్మెంట్ భూములకు కూడా నిబంధనలకు విరుద్ధంగా పాస్ పుస్తకాలు జారీ చేయటం, మండలంలో ఉన్న అనేక సిమెంటు ఫ్యాక్టరీలకు రసాయన కర్మగారాలకు సంబంధించిన భూములకు ఇతర విరుద్ధంగా ఉన్న బ్రిక్స్ కంపెనీలకు అనుమతులు ఇతర హక్కు పత్రాలను జారీ చేస్తున్నారు తనకు కలిసి మొక్కుబడులు చెల్లిస్తే పనులు మాత్రం హ్యాపీగా మరియు సాఫీగా  అనుమతులు,  సంభావన ఇవ్వనివారికి దయనీయ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన ఆర్డిఓ ఆదేశాలు ఇచ్చిన ఐ డోంట్ కేర్ అంటూ బేఖాతరు.

 నేనే రాజు నేనే మంత్రి అంటున్న తాసిల్దార్ మనోహర్.  ఇస్తానుసారంగా వారికి నచ్చిన వారికే అనుమతులు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ చేతులు దులిపేసుకుంటున్న మనోహర్.

 పరిశ్రమల చేతిలో కీలుబొమ్మగా మారిన తాసిల్దార్ మనోహర్ కు పలు రకాల సహాయ కారాలు ఉండటంతో ఏమి చేయలేని పరిస్థితి.

 ఈ తాసిల్దార్ పై రాష్ట్రంలో ఏ అధికారిపై లేనటువంటి కంప్లీట్లు వీరిపై ఉన్నప్పటికిని రెవిన్యూ ఉన్నత అధికారులు మాత్రం సరైన చర్యలు చేపట్టడం కాలయాపన చేయటంతో కొన్ని గ్రామాల వారు పరోక్షంగా చాలా నష్టపోయారు కొన్ని గ్రామాలలో పరిధిలో భూములకు తగిన హక్కు పత్రాలు ఇవ్వటం సాధ్యం కాకపోయినా వీఆర్వోలపై ఒత్తిడి చేసి తాను అనుకున్న పనులను సజావుగా నిర్వహించడంలో వారికి వారే సాటిగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి మండలంలో తాసిల్దారుకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు బదిలీ అయినా రెవిన్యూ ఇన్స్పెక్టర్ను తిరిగి మరల ఇక్కడే డిప్టేషన్ నియమించి కోవడం వల్ల నిబంధనలకు విరుద్ధంగా జరిగే పనులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు మండల రెవెన్యూ సేవలు ప్రభుత్వం ఆశించిన రీతిలో ప్రజలకు అందటం లేదని ఆవేదన ఉంది అధికార దుర్వినియోగంతో పాటు అవినీతి ముసుగులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న రెవిన్యూ అధికారులపై ప్రత్యేక విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అనేక మందిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే ఇక్కడ జరిగే అక్రమాలన్నీ జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ పూర్తిస్థాయి తాసిల్దార్ను నియామకం చేయటంలో నిర్లక్ష్యం చేయటంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు నందిగామ రెవిన్యూ డివిజన్లో అధికారికే బాలకృష్ణ అనేకసార్లు జగ్గయ్యపేట మండలం రెవిన్యూ వ్యవస్థ పై అసంతృప్తిని వ్యక్తం చేసి చేతులు దులుపుకుంటున్నారే కానీ ఇలాంటి నిర్లక్ష్యపు అధికారిని మార్చేందుకు ప్రభుత్వం నివేదిక సమర్పించడంలో విఫలమయ్యారు అనే ఆరోపణ ఉన్నాయి కుటమీ ప్రభుత్వంలో ఉద్యోగులకు స్వేచ్ఛ వాతావరణం అందిస్తున్న జగ్గయ్యపేట మండలంలో రెవిన్యూ తాసిల్దార్ మనోహర్ వేధింపులకు అన్నవరం విఆర్ఓ వరలక్ష్మి ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుమందు తీసుకోవడంతో ఆమె పరిస్థితి ఆందోలంకారంగా మారింది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అధికార దుర్యోగానికి పాల్పడుతూ ప్రజలకు సరైన సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0