కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా: చంద్రబాబు

రాజభారత్ న్యూస్, హైదరాబాద్, జూలై 26 : ఏపీలో పేదరిక నిర్మూలనకు తాను కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపిన విషయం తెలిసిందే. అయితే కుప్పం నియోజకవర్గంలోనే 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబసభ్యులు కూడా భాగస్వాములు అవుతారని తెలిపారు. ఇప్పటివరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా.. 57,503 మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు.
What's Your Reaction?






