దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్లు అందజేసిన శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

రాజ భారత్ న్యూస్, (14/06/2025) జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారి నివాసంలో జగ్గయ్యపేట నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు వడ్డేపూడి ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో స్వయం శక్తి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అభివృద్ధి సంఘం వారి సౌజన్యంతో వత్సవాయి గ్రామానికి చెందిన మార్కపుడి పుల్లారావు, కుక్కల దినేష్ అనే ఇద్దరు దివ్యాంగులకు తాతయ్య గారు స్వయంగా వారి చేతుల మీదుగా బ్యాటరీ సైకిల్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఏలూరి గోపాలరావు, కౌన్సిలర్లు నకిరకంటి వెంకట్, గొట్టే నాగరాజు, పేరం సైదేశ్వర రావు, కర్ల జోజి, కాటగాని నరసింహారావు, వంగూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






