గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో ఆ నలుగురు!

Jun 14, 2025 - 13:12
 0  1
గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో ఆ నలుగురు!

రాజ భారత్ న్యూస్, (14/06/2025) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్‌ సినీ అవార్డుల కార్యక్రమం మరికొద్ది గంటల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ లో గ్రాండ్ గా మొదలవుతుంది. కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సినిమా అవార్డుల కార్యక్రమం నిర్వహించకపోవడంతో.. ఈ సారి అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లను చేసింది FDC.

2014 నుంచి 2023 వరకు బెస్ట్ సినిమాలకు.. 2024 ఏడాదికి గాను అన్ని విభాగాలకు గద్దర్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు టాలీవుడ్ కు చెందిన అనేక సినీ సెలబ్రిటీలు రానున్నారు. ఇప్పటికే షూటింగ్స్ తో బిజీగా ఉన్న కొందరు.. హైదరాబాద్ కు చేరుకున్నారు.

అయితే ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరోలు.. ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్స్ గా ట్రీట్ చేసే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. గద్దర్ అవార్డుల కార్యక్రమానికి కచ్చితంగా రానున్నారని తెలుస్తోంది. నలుగురూ కలిసి ఒకే వేదికపై సందడి చేయనున్నారని సమాచారం.

దీంతో అదే నిజమైతే.. సినీ ప్రియులు, అభిమానులకు కన్నుల పండుగే. ఎందుకంటే నలుగురూ కలిసి కనిపించి చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకు ఇప్పుడు ఆ మూమొంట్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నట్లు సినీ ప్రియులు, కామన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఫర్ సూపర్ గ్రూప్ పిక్ అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు.

కాగా, రీసెంట్ గా అవార్డుల వివరాలు FDC చైర్మన్ దిల్ రాజు వివరించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత జరగనున్న అవార్డుల వేడుకను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందని తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు వేడుక ప్రారంభమవ్వగా, ఐ & పీఆర్ ద్వారా లైవ్ రానుందని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులకు అవార్డుల వేడుక చేరువవ్వాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు బెస్ట్‌ ఫిల్మ్‌ (ఏడాదికి మూడు చొప్పున)కు సంబంధించిన హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌.. అవార్డులు అందుకుంటారని తెలిపారు. ఉత్తమ సినిమాలకు గాను.. ఇలా నలుగురికి పురస్కారాలు ఇవ్వనుండడం ఇదే తొలిసారని చెప్పారు.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0